భద్రాచలం మండలం పునరుద్ధరణ చేసిన సీఎం రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం భద్రాచలం మండలాన్ని రద్దుచేసి మూడు గ్రామ పంచాయతీలుగా విభజించి అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిపిందని విమర్శించారు. దక్షిణ అయోధ్య అభివృద్ధికి నోచుకోకుండా చేశారని అన్నారు.