బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. మార్చి 30న ఆరంభమైన శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలకు శనివారం పూర్ణాహుతి పలికారు. ఈ సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో చేసిన పూజలు భక్తులను తన్మయులను చేశాయి. ఆలయం తలుపులు తెరిచాక సుప్రభాతం పలికి ఆరాధించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఉదయం నుంచి మాడవీధులు కిక్కిరిసిపోయాయి.