అంతర్జాతీయ క్రీడల్లో రాణించే విధంగా గిరిజన విద్యార్థులను తీర్చిదిద్దాలని భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ తెలిపారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. త్వరలో జరిగే జాతీయ స్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ మేరకు సాయికిరణ్ పీఓను శుక్రవారం కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారుడికి రూ. 10 వేల విలువైన హాకీ కిట్ ను పీఓ అందించి అభినందించారు.