ముక్కోటి పర్వదినానికి భద్రాచలం వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాట్లు చేస్తున్నట్లు భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు తెలిపారు. శనివారం స్థానిక నాయకులతో కలిసి భద్రాచలం రామాలయ, కరకట్ట పరిసర ప్రాంతాల్లోని పనులను పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.