ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిపొందేందుకు కొందరు ఎస్టీ బోగస్ కుల ధ్రువపత్రాలు పొందుతున్నారని, అలాంటి వారిపై రెవెన్యూ యంత్రాంగం దృష్టి సారించాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు చర్ల తహసీల్ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కూడా బోగస్ ఎస్టీ కుల ధ్రువపత్రాలు జారీ అయ్యాయని, వాటిపై కూడా రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేశామన్నారు.