ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జర్నలిస్టు ముకేష్ చంద్రకర్ హత్యకు నిరసనగా చర్ల మండలంలో జర్నలిస్ట్ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం శాంతిరాలి నిర్వహించారు. చర్ల మండలంలోని జర్నలిస్టులు స్థానిక అంబేడ్కర్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ మీదుగా చర్ల పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో ఆఫీస్ల ప్రధాన రహదారి గుండా కొవ్వొత్తులతో నినాదాలు చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించారు.