
ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు
AP: రైతులకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఆగస్టు నాటికి రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందించనుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ప్రతి పాస్‌బుక్‌పై క్యూఆర్ కోడ్‌తో పాటు ఆధార్ ఆధారంగా తమ సొంత భూమి వివరాలు తెలుసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. 2027 డిసెంబర్ నాటికి భూముల రీసర్వే పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.