ఛత్తీస్ గఢ్ ప్రాంతం నుంచి చర్ల వైపుగా వస్తున్న ఓ కుటుంబం చర్ల సరిహద్దుల్లో సోమవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని పర్యటనలోని ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకటరావు తమ వాహనాలను ఆపి క్షతగాత్రుల స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యశాలకు తరలించే క్రమంలో స్వయంగా క్షతగాత్రులను మోసుకుంటూ అంబులెన్స్లో ఎక్కించేందుకు ఎమ్మెల్యే కృషి చేయడం పట్ల స్థానికులు ప్రశంసించారు.