చర్ల మండలంలోని గ్రామాల్లో ఉన్న మంచినీటి ట్యాంకులను వారానికి ఒకసారి తప్పనిసరిగా శుభ్రం చేయించి క్లోరినేషన్ జరపాలని సిపిఎం పార్టీ చర్ల మండల కార్యదర్శి మచ్చా రామారావు డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలన్నారు. దోమల నివారణకు దోమల మందు పిచికారి చేయాలని కోరారు.