చర్ల సరిహద్దు ఛత్తీస్ ఘఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ పామేడు పోలీసు స్టేషన్ పరిధి దర్మారంలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం దర్మారం, కొండపల్లి, ధారెల్లి ఆశ్రమ విద్యార్థులకు సీఆర్పీఎఫ్ 151 బెటాలియన్ కమాండెంట్ రాజీవ్ కుమార్ చేతుల మీదుగా సైకిళ్లు పంపిణీ చేశారు. మూడు ఆశ్రమ పాఠశాలలకు చెందిన 330 మంది విద్యార్థులకు బ్యాగులు, నోటు పుస్తకాలు, పెన్నులు, జామెట్రీ బాక్సులు పంపిణీ చేశారు.