
GOOD NEWS.. ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు దరఖాస్తుల స్వీకరణ
AP: అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణకు అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తోంది. 2019 అక్టోబర్ 15కు ముందు జరిగిన ఆక్రమణలకు సంబంధించే వార్డు సచివాలయాలు, మీ సేవాలో దరఖాస్తులు స్వీకరించనుంది. లబ్ధిదారులు రుజువు పత్రాలు అందించాలి. మహిళల పేరుపై పట్టా, కన్వేయన్స్ డీడ్ అందించిన రెండేళ్ల తర్వాత ప్రభుత్వం యాజమాన్య హక్కులు ఇవ్వనుంది. 150 గజాల వరకు ఉచితంగా, ఆపై ఉంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.