దుమ్ముగూడెం పర్ణశాల శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ ఛైర్మన్ అవినాష్ రెడ్డి శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శేషం కిరణ్ కుమారాచార్యులు, భార్గవాచార్యులు ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సీత కుటీర ప్రదేశంతో పాటు నార చీరల ప్రాంతాలను దర్శించుకున్నారు.