దుమ్ముగూడెం మండలంలో కొట్టుకుపోయిన వర్ల కల్వర్టును తొలగించి వంతెన కల్వర్టు నిర్మించాలని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి సాయన్న డిమాండ్ చేశారు. నడికుడి గ్రామపంచాయతీ పరిధిలో గల ధర్మారం - తెల్లం రాజులు గుంపుకి పోయే రోడ్డు పొలాల్లో నుంచి వచ్చే వరద నీటి తాకిడికి కొట్టుకు పోతుందని చెప్పారు. వరదల సమయంలో ఆ గ్రామానికి వెళ్లాలంటే వర్షపు నీరు 5 అడుగుల లోతుకు ప్రవహిస్తుందని తెలిపారు.