ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

65చూసినవారు
ప్రతిఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి
ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పర్ణశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి రేణుక రెడ్డి అన్నారు. బుధవారం దుమ్ముగూడెం మండలం పర్ణశాల పిహెచ్సీ ఆధ్వర్యంలో బక్కచింతలపాడు, ఎం. కాశీనగరం గ్రామాల్లో దోమల మందు పిచికారి చేశారు. అనంతరం ఇంటింటి సర్వే నిర్వహించి, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వైద్యసిబ్బంది పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్