భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం హెచ్చుతగ్గులకు గురవుతోంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు 45 అడుగులకు పెరిగిన వరద ఆ తర్వాత తగ్గుముఖం పట్టింది. రాత్రి 8 గంటలకు 44. 7అడుగులకు చేరింది. ఇదే సరళి కొనసాగితే 43 అడుగుల కంటే తగ్గి మొదటి ప్రమాద హెచ్చరికను విరమించే వీలుంది. స్నానఘట్టాల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు. కొర్రాజులగుట్ట లోని నన్నపనేని మోహన్ పాఠశాలలో పునరావాస కేంద్రం కొనసాగుతోంది.