భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు

78చూసినవారు
భద్రాద్రి రామయ్యకు స్వర్ణతులసి పూజలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో స్వామివారి ఉత్సవమూర్తులకు అర్చకులు శనివారం స్వర్ణతులసి పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ తలుపులు తెరిచి సుప్రభాతం పలికి ఆరాధన, ఆరగింపు, సేవాకాలం, నిత్యహోమాలు, నిత్యబలిహరణం, తదితర నిత్యపూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను బేడా మండపానికి తీసుకువచ్చి నిత్యకల్యాణం నిర్వహించారు. కల్యాణంలో పాల్గొన్న జంటలకు ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్