డీఎస్సీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదు: బీఆర్ఎస్

85చూసినవారు
ప్రభుత్వం డీఎస్సీ అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేయడం సరికాదని చర్ల మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సోయం రాజారావు అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని చర్లలో ధర్నా నిర్వహించారు. అనంతరం తహసిల్దారుకు వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా దిగివచ్చే డీఎస్సీ పరీక్షను మూడు నెలలపాటు వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్