చర్ల లోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో శుక్రవారం ఒక్క సారిగా వరద పోటెత్తింది. ఛత్తీస్గ గఢ్ లో కురుస్తున్న వర్షాలకు జలా శయానికి భారీగా వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ప్రాజెక్టులో 22 గేట్లు ఎత్తివేసి 99, 257 క్యూసెక్కుల చొప్పున దిగువ గోదావరి నదికి విడుదల చేస్తున్నారు. ఎగువ క్యాచ్మెంట్ నుంచి 1, 00, 267 క్యూసెక్కుల మేర ఇన్ఫ్ల వస్తోంది. ప్రాజెక్టు వద్దకు చేరుకున్న ఏఈ ఉపేందర్ సిబ్బందిని అప్రమత్తం చేశారు.