చర్ల సరిహద్దు చత్తీస్ ఘఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా జాగరగుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమర్‌గూడ-కొర్మెట మధ్య నిర్మాణంలో ఉన్న రోడ్డులో బుధవారం నక్సలైట్లు అమర్చిన ప్రెషర్ ఐఈడీ పేలింది. ఐఈడీ పేలుడుకు గురై జేసీబీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన జేసీబీ డ్రైవర్‌కు వెంటనే ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్‌లో దంతెవాడ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు దంతెవాడ ఏఎస్పీ ఆర్కే బర్మన్ తెలిపారు.