వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చొద్దని ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం భద్రాచలం పట్టణం పాలకేంద్రం వద్ద ఎంపీ డీకే అరుణ దిష్టిబొమ్మ దహనం చేశారు. బోయ, వాల్మీకులను తెలంగాణలో ఎస్టీ జాబితాలోకి కలపాలని మాట్లాడారని, దీన్ని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం వ్యతిరేకిస్తుందని అన్నారు. ఎంపీ డీకే అరుణ పార్లమెంట్ సమావేశాల్లో మాట్లాడిన మాటలు వెనకకు తీసుకోవాలన్నారు.