మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు

64చూసినవారు
మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన కరపత్రాలు
దుమ్ముగూడెం మండలంలోని ములకపాడు క్రాస్ రోడ్డు వద్ద మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు వెలిశాయి. ఈ కరపత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు శనివారం రాత్రి విడిచి వెళ్లారు. మావోయిస్టుల స్వార్థప్రయోజనాల కోసం అమాయక పేద ప్రజలు బలైపోతున్నారని, ఐఈడి మందు పాతరలు, బూబి ట్రాప్స్ లను పోలీసుల కోసం కాకుండా అమాయక ఆదివాసీ, గిరిజన, పేద ప్రజల కోసం పెట్టి వారిని అడవికి దూరం చేయాలని చూస్తున్నారని కరపత్రాలలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్