బస్సులో సెల్ ఫోన్ పోగొట్టుకోవడంతో స్టేషన్ మేనేజర్ ఆ మహిళకు ఫోను అందజేసిన సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. పెద్దపల్లికి చెందిన పాఠకుల రిషిత అనే మహిళ రూ. 12వేల విలువైన సెల్ ఫోన్ భద్రాచలం డిపోకు చెందిన కొత్తగూడెం వెళ్లే ఆర్టీసీ బస్సులో పొగొట్టుకుంది. ఆ సెల్ ఫోన్ అందులో ప్రయాణికునికి దొరకగా వారు తీసుకువచ్చి స్టేషన్ మేనేజర్ అల్లం నాగేశ్వరరావుకు అందజేశారు. ఆ ఫోన్ నెంబర్ల ఆధారంగా ఎవరి ఫోనో తెలుసుకుని భద్రాచలం వచ్చి తీసుకోవాలని చెప్పగా రిషిత బస్టాండ్ కు రావడంతో ఆమెకు స్టేషన్ మేనేజర్ సెల్ ఫోన్ అప్పగించారు.