లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

63చూసినవారు
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదనీటి వల్ల భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. బుధవారం సాయంత్రం 44.1 అడుగుల నీటిమట్టం నమోదైంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ ప్రకటించారు. భద్రాచలం వద్ద గోదావరి కరకట్టపై రాకపోకలు నిలిపివేశారు. ఇంకా నీటిమట్టం పెరిగితే రహదారులపైకి వరద నీరు చేరే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్