చర్ల బీజేపీ కార్యాలయంలో మంగళవారం కేంద్ర బడ్జెట్ను హర్షిస్తూ ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడ్జెట్ అన్ని రంగాల వారికీ ప్రయోజనకరంగా ఉందని బీజేపీ మండల అధ్యక్షుడు నూప రమేష్ హర్షం వ్యక్తం చేశారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలన్నింటిలో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రభుత్వ ట్రాక్ రికార్డ్, నిర్మాణాత్మక సంస్కరణలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు.