జన్ సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖార్జి జయంతి సందర్బంగా ఆదివారం భద్రాచలం బీజేపీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కుంజా ధర్మా మాట్లాడుతూ జనసంఘ్ స్థాపించి ప్రజల కోసం పోరాడారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధనకోసం పార్టీ శ్రేణులందరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. నియోజకవరంలో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు పనిచేయాలని సూచించారు.