హనుమాన్ జయంతి సందర్భంగా రాకపోకలు నిలిపివేత

51చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా రాకపోకలు నిలిపివేత
భద్రాచలంలోని తాతగుడి సెంటర్ వద్ద రాకపోకలు పూర్తిగా నిలిపివేశారు. తాతగుడి వద్ద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం రాకపోకలు నిలిపివేశారు. అన్నదానం సందర్భంగా వంటలు చేయడానికి రోడ్డు మూసివేశారు. రాకపోకలు నిలిపివేయడంతో ప్రయాణికులు, భక్తులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు అక్కడ ఆలయం వద్ద రహదారి నుంచి రాకపోకలు జరపకుండా పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్