భద్రాచలం బస్టాండ్ అవుట్ గేట్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ ఆటో కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సై విజయలక్ష్మి పాల్గొని కేక్ కట్ చేసి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రెసిడెంట్ షేక్ అజీమ్ మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా ఆటో రిక్షా రవాణా వాహనంగా ప్రాచుర్యం పొందిందని అన్నారు. ఆటో ద్వారా అతి సులభంగా మారుమూల ప్రాంతాలకు చేరుకుంటారని చెప్పారు.