రఘునాథపాలెం మండలంలోని పుటానితండాలో విద్యుదాఘాతంతో శుక్రవారం మూడు ఆవులు మృతి చెందాయి. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం. తండాకు చెందిన వశ్య, శంకర్, గుగలోతు రాంజ్యాకు చెందిన ఆవులను మేతకు విడిచారు. ఓ రైతు పొలంలోని 11 కేవీ ట్రాన్స్ ఫార్మర్ వద్దకు చేరుకున్న ఆవులు అక్కడి ఎర్త్ పైపును తాకడంతో షాక్ గురై అక్కడికక్కడే మృతి చెందాయి. దీంతో ఏఈ సతీష్, లైన్ ఇన్స్పెక్టర్ దేవీలాల్ చేరుకుని పరిశీలించారు.