ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన ఆర్ఓ ఆర్ చట్టంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 24న ఐడీఓసీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని రైతు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సభ్యులతో పాటు ఆర్ ఓ ఆర్ చట్టంపై అవగాహన గల వారంతా హాజరై సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు.