జూలై 1 నుండి అమలు కానున్న కొత్త న్యాయ చట్టాలలో ఒకటైన భారతీయ సాక్ష్య అధినియ చట్టం 2023 పై జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ కొత్తగూడెం న్యాయవాదులకు శనివారం అవగాహన కల్పించారు. కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.