భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార నిగం లిమిటెడ్ (బి. ఎస్. ఎన్. ఎల్) ను ఆదరించాలని ఏజీఎం జి. సుభాష్ కోరారు. బుధవారం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం లో ఉద్యోగులు, సిబ్బంది ప్లే కార్డ్స్ చేత పట్టుకొని బైక్ ర్యాలీని నిర్వహించి వినియోగదారులకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ కొత్తగూడెం డి. ఈ కార్యాలయం నుంచి సెంట్రల్ పార్క్ వరకు, తిరిగి విద్యానగర్ కాలనీ బైపాస్ రోడ్డు వరకు కొనసాగింది.