భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజావాణిలో అర్జీలు సమర్పించే వారు తమ అంశాలను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆదివారం సూచించారు. ఉదయం 10: 30 గంటలకు ప్రారంభమవుతుందని వివరించారు.