భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచలో సస్పెండ్ చేసిన జిల్లా అధ్యక్షుడు డి. వెంకటేశ్వరరావుతో పాటు మరికొందరిని తిరిగి తీసుకోవాలని కోరుతూ PRTU సభ్యులు శనివారం నిరసన తెలిపారు. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనకారులను తొలగించారు. ఈ ఘటనల మధ్యే ఎమ్మెల్సీ సమక్షంలో నరసింహారావు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే డి. వెంకటేశ్వరరావు ఎమ్మెల్సీ సమక్షంలో జరిగిన నియామకం ఏకపక్షమని, చెల్లదని ప్రకటించారు.