బూర్గంపాడు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: ఐటీడీఏ పీవో

73చూసినవారు
బూర్గంపాడు: వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి: ఐటీడీఏ పీవో
మారుమూల ప్రాంత పీహెచ్సీలలో పనిచేసే డాక్టర్లు, సిబ్బంది సమయపాలన పాటించి వైద్య చికిత్సలు అందించాలని ఐటీడీఏ పీవో బి. రాహుల్ అన్నారు. శుక్రవారం బూర్గంపాడు మండల పరిధిలోని మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య కేంద్రంలోని ఓపి, డెలివరీ, మందులకు సంబంధించిన రికార్డులను పరిశీలించి, అందిస్తున్న వైద్య సౌకర్యాల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్