బూర్గంపాడు మండల పరిధిలోని సారపాకలో గల ఐటీసీ పీఎస్పీడీ యాజమాన్యం ప్రజల రక్షణ కొరకు స్పీడ్ బ్రేకర్లు వేయించాలని ఐటీసీ అడ్మినిస్ట్రేటివ్ అధికారి చెంగల్ రావుకు మంగళవారం వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీహెచ్‌పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పేరాల శ్రీనివాస రావు, నాయకులు కర్రీ నాగేశ్వరరావు, బనాత రాజా, తదితరులు పాల్గొన్నారు.