బూర్గంపాడు మండలం ఉప్పుసాక గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో పదో తరగతి విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని కోరారు. కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు.