ఆటో డ్రైవర్ పై కేసు నమోదు

60చూసినవారు
ఆటో డ్రైవర్ పై కేసు నమోదు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ పట్టణంలోని నవభారత్ వద్ద జూన్ 16న దాట్ల నాగేశ్వరరావు, అతని తల్లి జయ కలిసి టూవీలర్ పై వెళ్తుండగా వెనుక నుంచి టేకులపల్లి మండలం కోక్యాతండాకు చెందిన హరికృష్ణ తన ఆటోతో ఢీకొట్టాడు. దీంతో జయకు గాయాలయ్యాయి. ఆమె హైదరాబాద్ లో చికిత్స తీసుకుని బుధవారం ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాము కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్