భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవాపురం, జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆగస్టు 19న పౌర్ణమి సందర్భంగా ఆలయ యాగశాలలో చండీహోమం నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి రజనీకుమారి తెలిపారు. చండీహోమంలో పాల్గొనే భక్తులు 2516/- చెల్లించి గోత్రనామాలు నమోదు చేసుకోవాలని తెలిపారు.