చుంచుపల్లిలోని ఎస్సీ బాలికల ప్రీ మెట్రిక్ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి భోజనం చేసి, అనంతరం స్వెట్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో విద్యార్థినులకు రక్షణ కోసం స్వెటర్లను అందజేయడం జరిగిందన్నారు.