సేవాలాల్ బంజారా సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా కోటేష్, రాష్ట్ర కోశాధికారిగా రవికుమార్, జిల్లా ఉపాధ్యక్షుడిగా శోభన్ నియమితులయ్యారు. చుంచుపల్లి మండలంలో శనివారం వారికి నియామక పత్రాలను ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు రాంబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ చేతుల మీదుగా అందజేశారు. కొత్తగా నియమితులైన వారు జాతి అభివృద్ధి, హక్కుల కోసం సంఘం నిర్ణయం మేరకు పని చేయాలని సూచించారు.