భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సిపిఐ ఎంఎల్- మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ కార్యాలయంలో మంగళవారం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు చేయాలని ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 24న హైదరాబాదులో జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ ఎంఎల్-మాస్ లైన్ (ప్రజాపంథా) పార్టీ రాష్ట్ర కమిటీ ముద్రించిన పోస్టర్లను జిల్లా నాయకులు నిమ్మల రాంబాబు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.