దివ్యాంగులు ఉపకరణాల శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రి జిల్లా సమ్మిళిత విద్యా కో ఆర్డినేటర్ ఎస్కే. సైదులు సూచించారు. తెలంగాణ సమగ్ర శిక్ష, భారత కృత్రిమ అవయవాల ఉపకరణాల సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 27న ఆనందఖని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించనున్నామని బుధవారం తెలిపారు. జిల్లాలో 18సంవత్సరాల లోపు వయసు కలిగిన దివ్యాంగ పిల్లలకు అవసరమైన పరికరాలు, ఉపకరణాలను ఉచితంగా అందజేస్తామని పేర్కొన్నారు.