పోలీస్ అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ శనివారం కోర్టు ప్రాంగణంలోని మీటింగ్ హాల్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ 2017 నుండి 2020 వరకు పెండింగ్ లో ఉన్న కేసుల వారంట్లు త్వరితగతిన అమలుపరచాలని లేనిచో జామీనుదారులకు నోటీసులు ఇచ్చి పిలిపించాలని ఆదేశించారు.