శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: డీఎస్పి

59చూసినవారు
శాంతియుత వాతావరణంలో పండగలు జరుపుకోవాలి: డీఎస్పి
శాంతియుత వాతావరణంలో మతపరమైన పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని పాల్వంచ డిఎస్పి ఆర్. సతీష్ కుమార్ అన్నారు. జూన్ 7వ తేదీన జరగబోయే బక్రీద్ పండుగ సందర్భంగా మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్ ను నిర్వహించారు. పండుగ ఏ మతానిది అయిన సామరస్యత చాలా మంచి సంబంధాలను పెంపొందిస్తుందన్నారు. వచ్చేనెల జరగబోయే బక్రీద్ పండుగ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా శాంతియుత వాతావరణంలో జరిగేలా మత పెద్దలు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్