పాల్వంచ పట్టణంలోని పూర్ణ టీ సెంటర్ నందు మంగళగిరి పూర్ణ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ న్యాయవాది అయిత గంగాధర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం నాయకులు మంజూర్, శ్రీపాద. సత్యనారాణ, బొల్లం. భాస్కర్, రవి, స్వేరో రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య, పాల్వంచ కళాపరిషత్ కళాకారులు భాషా, ఖాసిం, నాగుల్ మీరా, గంగాధర్ ఫాలోవర్స్, ఆనంద్ పాల్గొన్నారు.