పాల్వంచలో జరిగిన సీపీఐ మండల మహాసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్రంలోని మోడీ-షా ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రశ్నించే కమ్యూనిస్టులపై కక్ష కట్టి బూటకపు ఎన్‌కౌంటర్లు చేస్తున్నారని ఆరోపించారు.'ఆపరేషన్ కగార్'పై విమర్శలు: మావోయిస్టుల ఎన్‌కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.