కొత్తగూడెం: ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి

57చూసినవారు
కొత్తగూడెం: ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేట్ విద్యాసంస్థలు ఎలాంటి విద్యాప్రమాణాలు పాటించడం లేదన్నారు. ఆ విద్యాసంస్థలపై పర్యవేక్షణ ఉండాలన్నారు. కార్యక్రమంలో వెంకటేష్, బానోత్ నాగరాజు, రమేష్, కిషన్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్