కొత్తగూడెం: బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి

60చూసినవారు
కొత్తగూడెం: బాలకార్మికులను గుర్తించి పాఠశాలల్లో చేర్పించాలి
ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ బాల కార్మిక నిర్మూలనకు పిలుపునిచ్చారు. యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (AID) గోడ పత్రికను గురువారం ఆవిష్కరించారు.
బడి ఈడు పిల్లలందరూ పాఠశాలల్లో చేరాలని, బాలలను పనిలో పెట్టుకుంటే చట్టపరమైన చర్యలుంటాయని ఆయన హెచ్చరించారు. బాల కార్మికులను గుర్తించి, వారిని పాఠశాలల్లో చేర్పించాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్