కొత్తగూడెం: దిశా సర్వసభ్య సమావేశం

73చూసినవారు
కొత్తగూడెం: దిశా సర్వసభ్య సమావేశం
ఈ నెల 12వ తేదీ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో దిశా కమిటీ సమావేశం జరగనుంది. జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఈ విషయాన్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంటు సభ్యులు, దిశా కమిటీ చైర్మన్ రామ సహాయం రఘురామిరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి మహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు, కో-చైర్మన్ పోరిక బలరాం నాయక్ తో పాటు జిల్లాకు చెందిన శాసనమండలి, శాసనసభ్యులు, దిశా కమిటీ సభ్యులు, మరియు అన్ని శాఖల అధికారులు హాజరుకానున్నారు.

సంబంధిత పోస్ట్