కొత్తగూడెం: దిశ సమావేశం వాయిదా: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

82చూసినవారు
కొత్తగూడెం: దిశ సమావేశం వాయిదా: జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపిన వివరాల ప్రకారం, జూన్ 12, 2026 గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఐడీఓసీ కార్యాలయంలో జరగాల్సిన దిశ కమిటీ సమావేశం వాయిదా పడింది. అనివార్య కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. తదుపరి సమావేశం తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంట్, శాసనమండలి, శాసనసభ్యులు, ఎంపీపీలు, దిశ కమిటీ సభ్యులు, అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ విషయాన్ని గమనించగలరు.

సంబంధిత పోస్ట్